
ఏఆర్ ఎస్‌ఐ నాగేంద్రకు సేవా పతకం
అనంతపురం: ఏఆర్ ఎస్‌ఐ కురుబ నాగేంద్రకు సేవా పతకం లభించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన్ను సేవా పతకానికి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వాసుదేవన్ నుంచి నాగేంద్ర సేవా పతకాన్ని అందుకున్నారు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన నాగేంద్ర 1990లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 36 ఏళ్లుగా క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. సేవా పతకం అందుకున్న నాగేంద్రకు ఏఆర్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.