
అనంతపురం, కర్నూలు జట్ల విజయం
అనంతపురం: అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ (ఉమెన్) అంతర జిల్లా టోర్నీలో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత నెల్లూరు జట్టు బ్యాటింగ్ చేసింది. 38.5 ఓవర్లలో 112 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. చంద్రిక మూడు వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. బి.నేహా 60 బంతుల్లో 56 పరుగుల (10 ఫోర్లు)తో నాటౌట్‌గా నిలిచింది. ఎస్.ఆశ్రియ 46 బంతుల్లో 45 పరుగులు చేసింది. వీరిద్దరి భాగస్వామ్యం గెలుపునకు బాటలు వేసింది. ఫలితంగా అనంతపురం జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
● కడప – కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు 49.3 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఎ.శిరీష 97 బంతుల్లో 94 పరుగులు (11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు ఐదు వికెట్లు నష్టపోయిన 196 పరుగులు చేసి విజయం సాధించింది. ఎం.అనూష 34 బంతుల్లో (9 ఫోర్లు) 51 పరుగులు, ఎస్వీ కుషల్యబాయి 98 బంతుల్లో 70 పరుగులు (12 ఫోర్లు) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
రైలు పట్టాలపై మృతదేహం
అనంతపురం సిటీ: అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటంపల్లి – ఖాదర్‌పేట మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహాన్ని శనివారం ఉదయం కనుగొన్నట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మృతుడు రైలు కింద పడి మరణించి ఉంటాడని భావిస్తున్నామన్నారు.
చంద్రిక (3 వికెట్లు) శిరీష (94 పరుగులు)

అనంతపురం, కర్నూలు జట్ల విజయం