
త్రివర్ణశోభితం.. రైల్వేస్టేషన్ భవనం
గుంతకల్లు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంతకల్లులోని రైల్వేస్టేషన్ భవనం త్రివర్ణ శోభితమైంది. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ విద్యుద్దీపాలతో భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకం రెపరెపలు మరింత అందాన్ని తెచ్చుపెట్టింది.
స్వాతంత్య్రోద్యమ
స్ఫూర్తిని కొనసాగిద్దాం
● హర్‌ఘర్ తిరంగా ర్యాలీలో డీఆర్‌ఎం
గుంతకల్లు: స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాలంటూ డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. గుంతకల్లు డివిజన్ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఆర్‌ఎం సీఎస్ గుప్తా ప్రారంభించారు. స్టేషన్ రోడ్డు, ప్రధాన రహదారి, ఆర్‌టీసీ బస్టాండ్, బీరప్పగుడి, హనుమన్ సర్కిళ్ల మీదుగా తిరిగి రైల్వేస్టేషన్‌కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీఎంఈ మంగచార్యులు, ఆర్‌ఫీఎఫ్ డీసీ ఆకాష్ జైశ్వాల్, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఎం సాదిక్, సీనియర్ డీపీఓ కో ర్డినేషన్ హెచ్‌ఎల్‌ఎన్ ప్రసాద్, సీనియర్ డీఈఎన్ కో ఆర్డినేషన్ జీబీ శ్రీనివాసులు, ఆర్‌పీఎఫ్‌లు పాల్గొన్నారు. అలాగే శ్రీశంకరనందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గోపాల్, ప్రిన్సిపాల్ సురేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
భర్త వేధింపులకు గర్భిణి బలి
కళ్యాణదుర్గం రూరల్: భర్త వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్డులో నివాసముంటున్న నాగరాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె శ్రావణి(24)కి గండ్లప్ప దొడ్డికి చెందిన బోయ శివన్న, కరెమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులుతో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం శ్రావణి మూడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చెల రేగాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రావణిపై భర్తతో పాటు అత్త, మామ దాడి చేసి, పుట్టింటికి పంపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

త్రివర్ణశోభితం.. రైల్వేస్టేషన్ భవనం