
●యూరియా వెతలు!
బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్‌లో ఆర్‌ఎస్‌కే వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
ఈసారి హెచ్చెల్సీకి ముందుగానే నీరు రావడం ఖరీఫ్ ముందస్తులోనే వర్షాలు కురువడంతో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా ఆవసరం ఎక్కువైంది. అయితే యూరియా కొరత రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ పెద్దలతో పాటు జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. యూరియా దొరుకుతోందని తెలియగానే ఆర్‌ఎస్‌కేల వద్దకు రైతులు, మహిళా కూలీలు పరుగు తీస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్, ఉంతకల్లు గ్రామాలు, కణేకల్లులోని ఆర్‌ఎస్‌కేల వద్ద గురువారం 6 గంటల నుంచి పడిగాపులు కాసినా యూరియా అందక కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగారు.
– బొమ్మనహాళ్/కణేకల్లు:

●యూరియా వెతలు!