
టమాట కిలో రూ.46
న్యూస్‌రీల్
అనంతపురం కక్కలపల్లి మండీలో సోమవారం కిలో టమాట గరిష్ట ధర రూ.46 పలికింది. కనిష్టం రూ.34, సరాసరి రూ.27 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
●చాలామంది అర్హులకు అందని ‘తల్లికి వందనం’ డబ్బు ●అధికారుల వద్ద అందుబాటులో లేని లబ్ధిదారుల జాబితా
●ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్న విద్యాశాఖ, సచివాలయ అధికారులు ●కనీసం సమాచారం కూడా చెప్పడం లేదంటూ లబ్ధిదారుల ఆవేదన
అనతంపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఇప్పటికీ వేలాదిమంది అర్హులైన విద్యార్థులకు ‘తల్లికి వందనం’ అందలేదు. రకరకాల పేర్లతో కొర్రీలు వేశారు. రాష్ట్రస్థాయిలో అన్ని లక్షలు, ఇన్ని లక్షలమందికి ఇచ్చా మని చెబుతున్నా అర్హులుగా ఉండీ లబ్ధి చేకూరని వారు క్షేత్రస్థాయిలో కుప్పలుతెప్పలుగా ఉన్నారు.
అందుబాటులో లేని జాబితా..
సహజంగా ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎంత మేర ఖర్చు చేశారనే వివరాలు ప్రకటించడం పరిపాటి. అయితే ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి ఇప్పటికీ జిల్లాలో ఎంతమంది విద్యార్థులకు అందించారనే వివరాలు అధికారుల వద్ద లేవు. జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు దాదాపు 4,13,160 మంది ఉన్నారు. వీరిలో ‘తల్లికి వందనం’ పథకం ఎంతమంది విద్యార్థులకు అమలు చేశారు... ఎంతమందికి రాలేదనే వివరాలు లేవంటే పథకం అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసు కోవచ్చని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ..
చాలామందికి లేని భూమిని చూపిస్తూ, నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు, కరెంటు బిల్లులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినట్లు చూపించి కోత విధించారు. ఇలాంటి వారు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను అందజేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్తే... తమకు సంబంధం లేదని గ్రామ,వార్డు సచివాలయాలకు వెళ్లాలని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే తమకు సంబంధం లేదు, విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్లాలని అంటున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పుకుంటున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కరించడం లేదంటూ పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా దిక్కులేదు..
చాలామంది లబ్ధిదారులు మండలాల్లో కాదని నేరుగా కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా దిక్కులేకుండా పోయింది. అక్కడికి వెళ్లినా సమస్య మళ్లీ మొదటకే వస్తోంది. కలెక్టర్, జేసీ ఏమో విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్లాలంటూ సిఫార్సు చేస్తున్నారు...డీఈఓ కార్యాలయానికి వెళ్లగానే తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. ఇలా తిరిగితిరిగి విసిగిపోయిన వేలాదిమంది లబ్ధిదారులు చివరకు పథకం గురించి అడగడమే మానేశారు. ‘తల్లికి వందనం’ పథకం అమలు చేసిన రోజు...మీడియా ప్రకటన ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు...వారిలో ఎంతమందికి డబ్బు పడింది.. ఎంత ఖర్చు చేశాం అనే వివరాలు కావాలంటూ స్వయంగా కలెక్టరేట్ నుంచి విద్యాశాఖను కోరినా తమకు తెలీదంటూ చేతులెత్తేశారు.
చీనీ టన్ను రూ.16 వేలు
అనంతపురం మార్కెట్‌యార్డులో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.16 వేలు పలికాయి.
ఈ పిల్లల పేర్లు ఎం.తేజస్విని, ఎం.సుశాంత్. తేజస్విని 8వ తరగతి చదువుతుండగా సుశాంత్ 7వ తరగతి చదువుతున్నాడు. అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్లకాలనీకి చెందిన ఈ పిల్లలకు తల్లీతండ్రీ ఇద్దరూ చనిపోయారు. చిన్నాన్న ఓబులేసు సంరక్షణలో ఉన్నారు. కూలీనాలి చేసుకునే వీరి కుటుంబానికి ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి చేకూరలేదు. పిల్లలిద్దరి పేర్లు అనర్హుల జాబితాలో చేర్చారు. డబ్బు వస్తే పిల్లలకు ఉపయోగడతాయనే ఆశతో వీరి చిన్నాన్న ఓబులేసు కలెక్టర్‌కు రెండు సార్లు, విద్యాశాఖ అధికారిని రెండుసార్లు కలిసి విన్నవించాడు. స్థానికంగా ఉన్న సచివాలయానికీ పలుమార్లు వెళ్లాడు. ఓబులేసును చూడగానే అధికారులు కసురుకోవడం తప్పితే సమస్య మాత్రం పరిష్కరించలేదు. దీంతో ఓబులేసు అధికారులను అడగడమే మానేశాడు. వీరిద్దరే కాదు కరెంటు బిల్లు అధికంగా చూపిస్తూ, వ్యవసాయ భూమి, నాలుగుచక్రాల వాహనాలు ఉన్నాయని పేర్కొంటూ, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు తప్పుగా నమోదు తదితర కారణాలతో జిల్లాలో వేలాదిమందికి ‘తల్లికి వందనం’ పఽథకాన్ని దూరం చేశారు.
న్యూస్‌రీల్
డబ్బు వేరే అకౌంట్‌లో వేశారు
34 ఎకరాలున్నట్లు చూపించారు
అన్ని అర్హతలు ఉన్నా రాలేదు
రూపాయి కూడా జమ కాలేదు
నా ఇద్దరు పిల్లలను ప్రయివేట్ పాఠశాలలో చదివిస్తున్నా. ఇద్దరికీ డబ్బు పడలేదు. బాబుకు సంబంధించి వేరొకరి అకౌంట్‌లో డబ్బు వేశారు. పాఠశాల వారు సంబంధం లేదంటున్నారు. అధికారులను అడిగినా ఫలితం లేదు. – సుగాలి గోవిందమ్మ, అయ్యవారిపల్లి, తాడిపత్రి మండలం
నా కూతురు గోపిక 6వ తరగతి చదువుతోంది. ‘తల్లికి వందనం’ పథకం అందలేదు. మాకు 8 ఎకరాల మెట్ట పొలం ఉంటే 34 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించారు. ఆ భూమి ఎక్కడుందో అధికారులే చూపించాలి.
– సునీత, వడ్రవన్నూరు,
రాయదుర్గం మండలం
నాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అన్ని అర్హతలు ఉన్నా ‘తల్లికి వందనం’ రాలేదు. మా పేరిట 10 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నాకు, నా భర్తకు 8 ఎకరాలు ఉంది. మాకు లేని భూమి ఎలా చూపుతారని రెవెన్యూ అధికారులను అడిగినా న్యాయం చేయలేదు.
– వన్నూరక్క, శెట్టూరు గ్రామం
మాకు ముగ్గురు పిల్లలు. నేను, నా భార్య వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు ‘అమ్మ ఒడి( పథకం అందింది. కూటమి ప్రభుత్వంలో మాత్రం మాకు ఒక రూపాయి కూడా జమ కాలేదు.
– తిప్పేస్వామి, ఎరడికెర,
బ్రహ్మసముద్రం మండలం

టమాట కిలో రూ.46

టమాట కిలో రూ.46

టమాట కిలో రూ.46

టమాట కిలో రూ.46

టమాట కిలో రూ.46