
ఢిల్లీ ‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఆర్ట్స్ కళాశాల విద్యార్థ
అనంతపురం ఎడ్యుకేషన్: ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని ఎస్. సుమియా (అర్థశాస్త్రం, తృతీయ సంవత్సరం) ఎంపికై ంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే మూడు రంగుల జెండా ఆవిష్కరణలో సుమియా పాల్గొననుంది. ఈ సందర్భంగా సోమవారం సుమియాను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ బాలాజీ నాయక్, జయలక్ష్మి, సోమశేఖర్, సుధాకర్ తదితరులు అభినందించారు.
డెత్ క్లెయిముల
పరిష్కారానికి కార్యాచరణ
అనంతపురం సిటీ: ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా ఉండి మరణించిన వారి డెత్ క్లెయిముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆ శాఖ కడప ప్రాంతీయ శాఖ కార్యాలయ కమిషనర్–1 రవితేజ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈపీఎఫ్‌ఓ సభ్యులకు, యాజమాన్యాలకు, పెన్షనర్లకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అపరిష్కృతంగా ఉన్న డెత్ క్లెయిములను వేగవంతంగా సెటిల్ చేసేందుకు సెప్టెంబర్ వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. డెత్ క్లెయిముల సమస్య పరిష్కారం కాని పక్షంలో కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో లేదా జిల్లా కేంద్రాల్లోని తమ శాఖ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఈపీఎఫ్ సభ్యులు యూఏఎన్‌కి ఈ–నామినేషన్ జత చేసి ఉన్నట్లైతే మరణానంతరం వారి కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లోనే డెత్ క్లెయిములు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సందేహాల నివృత్తి కోసం కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సెల్: 94911 38280 నంబర్‌లో కార్యాలయ పని వేళల్లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
వానో... వాన
● జిల్లాలో 16.2 మి.మీ సగటు వర్షపాతం
● పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు
అనంతపురం అగ్రికల్చర్: ఆరు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 12 నుంచి ఆగస్టు 5 వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ప్రస్తుతం అధిక వర్షపాతం నమోదవుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 28 మండలాల పరిధిలో 16.2 మి.మీ సగటు నమోదు కాగా సోమవారం పగలంతా కూడా చాలా మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. నార్పలలో 82.6 మి.మీ, యల్లనూరులో 82.2 మి.మీ భారీ వర్షం పడింది. శింగనమల 30.6 మి.మీ, పెద్దవడుగూరు 29.6, ఉరవకొండ 27.2, తాడిపత్రి 24.4, గార్లదిన్నె 22.4, పామిడి 20.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో కూడా మోస్తరుగా వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ కాగా ఇప్పటికే 122.6 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద జూన్ 1 నుంచి 150.1 మి.మీ గానూ 205.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 12 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. జూన్‌లో రెండు,జూలైలో 4 రోజులు కాగా ఈ నెలలో ఇప్పటికే ఆరు రెయినీడేస్ రికార్డయ్యాయి. వారం రోజులుగా వర్షాలు పడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉద్యాన పంటలకు మేలు చేకూరుస్తుండగా... అధిక వర్షాల వల్ల వ్యవసాయ పంటలు కొంత దెబ్బతినే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తెరపిచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఢిల్లీ ‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఆర్ట్స్ కళాశాల విద్యార్థ