
పవన పుత్రా.. పాహిమాం
గుంతకల్లు రూరల్/బొమ్మనహాళ్: శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా జిల్లాలోని నెట్టి కంటి ఆంజనేయ స్వామి, నేమకల్లు ఆంజనేయస్వామి క్షేత్రాలు కిటకిటలాడాయి. పవన పుత్రా.. పాహిమాం అంటూ భక్తుల నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. శనివారం వేకువజామునే ఆయా ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించిన అర్చకులు స్వామివార్లను విశేషంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. చుట్టు పక్కల జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్నదానం చేపట్టారు. నేమకల్లు ఆంజనేయ స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఉప లోకాయుక్త రజని కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి, కంప్లి మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, సురేష్‌బాబు స్వామిని దర్శించుకున్నారు.

పవన పుత్రా.. పాహిమాం

పవన పుత్రా.. పాహిమాం

పవన పుత్రా.. పాహిమాం

పవన పుత్రా.. పాహిమాం