
ప్రవీణ్, లక్ష్మీనారాయణరెడ్డి బూతులు తిట్టారు
శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్‌లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు. తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.