
ఎట్టకేలకు వన్‌టౌన్ సీఐ నియామకం
అనంతపురం: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎట్టకేలకు సీఐను నియమించారు. సీఐగా వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కడప నుంచి ఈయన బదిలీపై వచ్చారు. కాగా, గత రెండు నెలలుగా వన్‌టౌన్‌కు సీఐ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు అధికమయ్యాయి. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే స్పందించిన ఎస్పీ పి. జగదీష్ సీఐ నియామకానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇదిలాఉంటే, గతంలో వన్‌టౌన్ సీఐగా గోరంట్ల మాధవ్ విధులు నిర్వహించిన సమయంలో అధిక వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్‌ను అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ఆయనలాగే కఠినంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఎట్టకేలకు వన్‌టౌన్ సీఐ నియామకం