యంత్రం తగిలి వృద్ధుడి మృతి
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామంలో అజాక్స్ యంత్రం తగిలి వి.వేమన్న గౌడ్ (75) మృతిచెందాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. వివరాలు.. జీనులకుంటలోని ప్రాథమిక పాఠశాల వద్ద సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజాక్స్ యంత్రంలో కంకర, సిమెంట్ వేసి కలుపుతుండగా వెనుక వైపున ఉన్న వేమన్న ఎడమకాలుకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అందేలోపు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


