
జిల్లావ్యాప్తంగా గురువారం రంజాన్ వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ సాగాయి. మసీదులు, దర్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖబరస్తాన్‌లలో పెద్దల ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు జరిపారు. రంజాన్‌ను పురస్కరించుకుని మతపెద్దలు పర్వదిన విశిష్టత తెలియజేశారు. దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతన కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు
తెలియజేశారు. – అనంతపురం కల్చరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


దువా చేస్తున్న చిన్నారి