ఇంటిల్లి పాదికి లబ్ధి | Sakshi
Sakshi News home page

ఇంటిల్లి పాదికి లబ్ధి

Published Tue, Dec 5 2023 5:20 AM

- - Sakshi

గత ప్రభుత్వ హయాంలో సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. దీంతో జీవనోపాధులు మెరుగు పరుచుకున్నాం. ఇంటిళ్లి పాదికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరింది. మా కుమార్తెకు వరుసగా నాలుగేళ్లు అమ్మఒడి పథకం అందింది. మహిళా సంఘంలో మూడు విడతలుగా రూ.37.500 రుణమాఫీ అయింది. అలాగే సున్నా వడ్డీ కింద రూ.10వేలు లబ్ధి చేకూరింది. ఏడాదికి రూ.13.500 చొప్పున మూడేళ్లు రైతు భరోసా సొమ్ము అందుకున్నాం. సీఎం జగన్‌కు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.

– వేల్పుల భాస్కర్‌, సుజన,

తొండపాడు, గుత్తి మండలం

ఇంత గొప్ప పాలన చూడలేదు

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన ఎన్నటికీ మరువలేనిది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్‌ చేయించారు. ప్రతి నెలా 1వ తేదీన వలంటీర్‌ మా ఇంటి వద్దకే వచ్చి వితంతు పింఛన్‌ అందజేస్తున్నాడు. నా జీవితంలో ఇప్పటి వరకూ ఇంత గొప్ప పాలన ఎన్నడూ చూడలేదు. రాజన్న బిడ్డ మరో పదేళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా.

– గోళ్ల శివమ్మ, కళ్యాణదుర్గం మండలం

ఇంటి వద్దకే సంక్షేమం

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. సచివాలయం ద్వారా పల్లెల్లోనే అన్ని రకాల ప్రభుత్వ సేవలను పొందుతున్నాం. చివరకు ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వివిధ రకాల జబ్బులకు చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకూ నేను జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో చికిత్స చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నా. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో నయా పైసా ఖర్చు లేకుండా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను పొందాను. దీని ద్వారా నాకు బియ్యం కార్డు మంజూరైంది.

– దోణస్వామి, హుళ్లికల్లు,

కళ్యాణదుర్గం మండలం

1/3

2/3

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement