కూటమి అభ్యర్థులకు సమస్యల సెగ | - | Sakshi
Sakshi News home page

కూటమి అభ్యర్థులకు సమస్యల సెగ

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

మూడేళ్లు అవుతున్నా మంజూరు కాని పింఛన్లు, ఇళ్లు

నిర్మాణానికి నోచుకోని తాచేరు, పెద్దేరు వంతెన, బీఎన్‌ రోడ్డు

చెరుకు రైతులకు మంజూరు కాని బకాయిలు

గత ప్రభుత్వంలో అందే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం

పంచాయతీ స్ధ్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వైపు ప్రజలు మొగ్గు

బుచ్చెయ్యపేట: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం కన్న వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్ధుల విజయం వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా ఏ గ్రామంలో కూడా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్‌, ఇల్లు గాని మంజూరు చేయలేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ, 1,500లు, నిరుద్యోగులకు నెలకు రూ, 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. 50 ఏళ్లు వయస్సు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పింఛన్‌ ఇస్తామని,గ్రామ వలంటీర్లను తొలగించమని నెలకు రూ, 10 వేలు అందిస్తామని అన్ని రకాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. 25 వేల మంది రైతులు,కార్మికులు,ఉద్యోగులు ఆధారపడ్డ గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని రెండేళ్లుగా మూసివేసి చెరకు రైతులు, ఉద్యోగులను రోడ్డున పడేయడమే కాక రూ, 35 కోట్లు రైతుల చెరుకు బకాయిలను ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసింది. అధికారంలోకి వస్తే వడ్డాది, విజయరామరాజుపేటలో కూలిన తాచేరు,పెద్దేరు వంతెనలతో పాటు భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్‌) రోడ్డును బాగు చేస్తామని మూడేళ్‌లైయిన నేటికి వీటి నిర్మాణాలపై దృష్టి సారించలేదు. కూటమిలో కుమ్ములాటలతో పాటు ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే రాజులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజా సమస్యలు పరిష్కారం వైపు దృష్టి సారించకపోవడంతో పలు గ్రామాల ప్రజలు కూటమి పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానిక ఎన్నికల్లో కులాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంపైనా పలు గ్రామాల్లో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్నటికే రత్నంపేట గ్రామంలోకి ఎమ్మెల్యే రాజుని రాకుండా అక్కడ గ్రామస్తులు అడ్డుకోవడంతో కూటమి పాలనపై వ్యతిరేకత బయటపడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నెలకో పథకం ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల నగదు అందగా, కూటమి పాలనలో సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు. స్థానిక పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement