నాణ్యమైన సేవలే లక్ష్యంగా ‘సంజీవని హ్యాండ్స్‌ ఆన్‌’ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన సేవలే లక్ష్యంగా ‘సంజీవని హ్యాండ్స్‌ ఆన్‌’ శిక్షణ

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

తుమ్మపాల: ప్రజలకు మరింత చేరువగా, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ‘సంజీవని హ్యాండ్స్‌ ఆన్‌’ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రెడ్డి అచ్యుత కుమారి అన్నారు. అనకాపల్లి పట్టణంలోని నర్సింగరావుపేట, నారాయణ పాఠశాల ప్రాంగణంలో బుధవారం సంజీవని మిత్రలకు ‘సంజీవని హ్యాండ్స్‌ ఆన్‌‘ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 5 వరకు 6 బ్యాచ్‌లలో జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావించి, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో సమర్ధంగా వినియోగిస్తూ ప్రజలకు సకాలంలో, బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ‘ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని డిజిటల్‌ విధానంలో పర్యవేక్షిస్తూ, వ్యాధులను ముందుగానే గుర్తించి, నాణ్యమైన వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే సంజీవని ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచడం, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను అనుసంధానం చేయడం, వ్యాధుల ముందస్తు గుర్తింపు, ఉచిత వైద్య పరీక్షలు, టెలి మెడిసిన్‌ సేవలు, గర్భిణులు, పిల్లల ఆరోగ్యం, నిరంతర వైద్య పర్యవేక్షణ మొదలగు సేవలు అందించుట జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రశాంతి, డిస్ట్రిక్ట్‌ నోడెల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వెంకటెష్‌, జగదేశ్‌, ,శ్రీ దేవ గణేష్‌ , టాటా డిస్ట్రిక్ట్‌ లీడ్‌ , జయ భార్గవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement