నర్సీపట్నం: ఇంటి స్థల వివాదంపై రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ నర్సీపట్నానికి చెందిన పులపర్తి రామకోటి ఆర్డీవో కార్యాలయం ప్రధాన గేటు వద్ద అమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఇంటి స్థలం వివాదంపై కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోలేదని రామకోటి వాపోయారు. అధికారుల చుట్టూ తిరిగే ఓపిక లేక అమరణ నిరాహార దీక్షకు దిగానన్నారు. ఆఖరి బతుకు తెరువు కోసం పెట్టుకున్న బియ్యం వ్యాపారానికి కూడా సివిల్ సప్లయి అధికారులు ఆటంకం సృష్టిస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని అక్కడకు చేరుకుని టెంట్‌ను తొలగించారు. రామకోటికి నచ్చచెప్పి దీక్షను విరమింపజేశారు.


