విద్యుత్‌ బిల్లుల పేరుతో నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల పేరుతో నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండండి

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

అనకాపల్లి: విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సందేశాల పట్ల విద్యుత్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎస్‌ జిల్లా సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ గొప్ప ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లు బకాయి ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని, హెచ్చరిస్తూ గుర్తు తెలియని మొబైల్‌ నంబర్ల నుంనచి కొంతమంది వినియోగదారులకు నకిలీ సందేశాలు వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లు చెల్లింపుల ఆప్‌డేట్‌ చేయాలని, సందేశంలో ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌చేయాలని, లింక్‌ ద్వారా చెల్లింపులు చేయాలని సూచించే అటువంటి సందేశాలను నమ్మద్దని కోరారు. సైబర్‌ నేరగాళ్లు పంపించే నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సందేశాల్లోని లింకులను క్లిక్‌ చేయడం వల్ల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్‌ బిల్లులు, చెల్లింపుల వివరాలను అధికారిక మార్గాల ద్వారానే నిర్ధారించుకోవాలని, సందేహాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు, వాట్సప్‌ నంబర్‌. 9493681912 నంబర్లును సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement