చోడవరం: రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చోడవరం క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన 46వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భార్యాభర్తలు కంఠంరెడ్డి సాంబశివరావు, వరలక్ష్మి పలు పతకాలు సాధించారు. సాంబశివరావు 5 కిలోమీటర్ల వాకింగ్, 400 మీటర్ల రన్నింగ్‌లో సిల్వర్ మెడల్స్, 100 మీటర్ల రిలేలో బ్రాంజ్ మెడల్ సాధించారు. వరలక్ష్మి జావెలిన్‌త్రో, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించారు. వీరిని స్థానికులు అభినందించారు.
సాధించిన పతకాలతో వరలక్ష్మి,
సాంబశివరావు


