పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

Nov 18 2026 12:32 AM | Updated on Nov 18 2026 12:32 AM

అనకాపల్లి: జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఓటర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లు అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల బైండోవర్‌, గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను, స్థానికంగా అలజడులు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి తక్షణమే పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, బైండోవర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బెల్ట్‌ షాపులు, అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా గ్రామాల్లో అక్రమ మద్యం రవాణా, బెల్ట్‌ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రహరీ గోడలు, ఫెన్సింగ్‌ వంటి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, లోపాలుంటే సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో సరిచేయించాలన్నారు. సిగ్నల్‌ వ్యవస్థ సరిగా లేని మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై సాంకేతిక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement