రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి

Nov 18 2026 12:32 AM | Updated on Nov 18 2026 12:32 AM

నక్కపల్లి: జిల్లాలో ఉన్న రౌడీషీటర్లు, సంఘ విద్రోహక శక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు. నక్కపల్లి సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌తోపాటు, నిర్మాణంలో ఉన్న మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి ఆయన నక్కపల్లిలో పర్యటించారు. ముందుగా హెటెరో కంపెనీ వారు సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మిస్తున్న మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను పనులు పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వసతులు, ఆధునిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. అడ్డురోడ్డులో సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఐజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఈ వార్షిక తనిఖీల్లో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, ఎస్‌ఐలు రమేష్‌, విజయ్‌కుమార్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

యలమంచిలి రూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టి యలమంచిలి పోలీసులను ఆదేశించారు. మంగళవారం యలమంచిలి సర్కిల్‌ కార్యాలయం వార్షిక తనిఖీ చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులు,పెండింగ్‌ కేసుల దస్త్రాలను తనిఖీ చేశారు. సిబ్బంది, అధికారులతో సమీక్ష జరిపిన ఆయన వివాదాలు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా శాంతిభధ్రతల సమస్య తలెత్తితే ఏఆర్‌, మొబైల్‌ టీంలను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.

ఎస్‌.రాయవరం : అడ్డురోడ్డు సర్కిల్‌, ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్లను మంగళవారం విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సర్పంచ్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నారు. ఐజీ వెంట ఎస్పీ తుహిన్‌సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఉన్నారు.

నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ గోపీనాథ్‌ జెట్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement