తుమ్మపాల: భూముల రీసర్వే ప్రక్రియతో రైతులకు భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడంతో పాటు, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం సంపతిపురంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బుధవారం 626 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. భూముల వివరాల్లో పారదర్శకత, యాజమాన్య హక్కుల స్పష్టతకు రీ సర్వే ప్రక్రియ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ జి.ఆనందరావు, రైతులు పాల్గొన్నారు.


