స్టీల్‌ప్లాంట్‌ బ్యాటరీ–4 జీసీఎం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ బ్యాటరీ–4 జీసీఎం ప్రారంభం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ఓవెన్స్‌ బ్యాటరీ–4 పునరుద్ధరణ పనుల్లో ముందడుగు పడింది. బ్యాటరీకి చెందిన రెండు గ్యాస్‌ కలెక్టింగ్‌ మెయిన్‌ (జీసీఎం)లలో మొదటి దానిని ప్రారంభించారు. కొంతకాలంగా బ్యాటరీ–4 పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు జీసీఎంలు, 67 ఓవెన్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఓవెన్లలో తయారయ్యే గ్యాస్‌ను ఈ జీసీఎంలో కలెక్ట్‌ చేస్తారు. రెండింటిలో మొదటి జీసీఎం, సుమారు 10 ఓవెన్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో గ్యాస్‌ ఉత్పత్తిలో కొంత పురోగతి రానుంది. బుధవారం తెల్లవారు జాము 2.30 గంటలకు సీఎండీ ఎం.ఎన్‌.వి.ఎస్‌.ప్రభాకర్‌ పూజ చేసి జీసీఎంను ప్రారంభించారు. దీంతో రోజుకు సుమారు 15 పుషింగ్స్‌ పెరగనున్నాయి. తద్వారా శుక్రవారం నుంచి గ్యాస్‌ ఉత్పత్తి పుంజుకుంటుందని అధికార వర్గాల సమాచారం. కార్యక్రమంలో డైరెక్టర్లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement