ఉత్సాహంగా రిమ్‌ జిమ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రిమ్‌ జిమ్‌

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

గీతాలాపన చేస్తున్న విద్యార్థులు

పాయకరావుపేట: శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల్లో రిమ్‌ జిమ్‌ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తుని, పాయకరావుపేట, అన్నవరం శాఖలకు చెందిన 5800 మంది విద్యార్థుల మధ్య పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సాహిత్యం, సంగీతం, ఆటలు, క్రీడలు, లలిత కళలు, థియేటర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ వంటి అనేక అంశాలపై జూనియర్‌, సబ్‌ జూనియర్‌, సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ విభాగాలలో 31 రకాల పోటీలు నిర్వహిస్తున్నట్టు విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం ఈ రిమ్‌ జిమ్‌ వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 14న జరిగే ముగింపు ఉత్సవాల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి, ప్రొగ్రాం కన్వీనర్‌ గౌతమి, అకడమిక్‌ ఇన్‌చార్జులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement