నర్సీపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అండర్–17 వాలీబాల్ క్రీడా పోటీలు ఈ నెల 7వ తేదీన పెందుర్తి మండలం, రాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తమర్భ సంజీవ్ కుమార్ పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి సంజీవ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయురాలు సిహెచ్.లోవన్నారాయణమ్మను హెచ్‌ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం ఐఐటీ సీట్లు అవకాశం కూడా కల్పిస్తుందని ఎంఈవో పేర్కొన్నారు.


