డ్రోన్‌ వ్యతిరేక చర్యలపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ వ్యతిరేక చర్యలపై శిక్షణ

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

కై లాసగిరిపై భారత నావికా దళంతో డీఐజీ గోపినాథ్‌ జెట్టి

ఆరిలోవ: కై లాసగిరిపై డ్రోన్‌ వ్యతిరేక చర్యలపై ఏపీ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నావికాదళంతో కలిసి శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు డీఐజీ గోపినాథ్‌ జెట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ శిక్షణలో వివిధ సంస్థల మధ్య సమన్వయం, కార్యాచరణ సన్నద్ధత, డ్రోన్ల వల్ల ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే విధానాలు, సామర్థ్యాల బలోపేతం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఎస్పీ శ్రావణి, అడిషనల్‌ ఎస్పీ కె.వి. రమణ, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, ఎస్‌ఐ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement