చిన్నపూడిలో 173 ఓటర్ల ఓట్లు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చిన్నపూడిలో 173 ఓటర్ల ఓట్లు గల్లంతు

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

చినపూడి గ్రామస్తులకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్న ఓటర్లు

అచ్యుతాపురం రూరల్‌ : చిన్నపూడిలో సుమారు 173 మంది ఓటర్లు తమ ఓట్లు జాబితాలో కనిపించడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమ ఓట్లు రాంబిల్లి మండలంలో ఉన్నాయని, మరోసారి అచ్యుతాపురంలో ఉన్నాయని అధికారులు తెలిపినట్లు బాధిత ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాంబిల్లి మండలలోని 111వ బూత్‌లో ఓటు వేసిన తాము, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చిన్నపూడి పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించినప్పటికీ జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేకపోయామని తెలిపారు. తమ ఓటు హక్కు ఏ పరిధిలో ఉందనే స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. కనీసం రానున్న సర్పంచ్‌ ఎన్నికల నాటికై నా అధికారులు సమస్యను పరిష్కరించి, తమ పేర్లను సరైన ఓటర్ల జాబితాలో చేర్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement