మెరుగైన వైద్య సేవల కోసం సంజీవని పథకం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవల కోసం సంజీవని పథకం

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

దేవరాపల్లి : ప్రజల ఆరోగ్యం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు సంజీవని పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఆర్‌.అచ్యుతకుమారి తెలిపారు. దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంజీవని పథకాన్ని ప్రజలకు అందించేందుకు ఒక ఎంఎల్‌హెచ్‌పీకి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ సందర్భంగా స్టోర్‌ రూమ్‌, వ్యాక్సిన్‌ రూమ్‌, ల్యాబ్‌ను పరిశీలించారు. పీహెచ్‌సీ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఏఎన్‌ఎం, ఇతర వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి వైద్యాధికారి వైద్య సేవలందించడంతో పాటు ప్రతి హెల్త్‌ సబ్‌సెంటర్‌లను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. గ్రామాల్లో అలసత్వం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement