నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలో రాజకీయనాయకులు పలువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, సతీమణి కళావతి దంపతులు కుటుంబ సభ్యులతో పెదబొడ్డేపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంటుందన్నారు. తమ చైర్మన్ అభ్యర్ధి చింతకాయల అనిత తప్పని సరిగా విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయం సాధించడం ఖాయం : అనిత సన్యాసిపాత్రుడు
వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్ధి చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు ఐదు రోడ్లు పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పురపాలిక ప్రజలు తనకు తప్పనిసరిగా విజయాన్ని అందిస్తారన్నారు. చైర్మన్‌గా విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్..
జిల్లా పరిషత్ హైస్కూల్(మెయిన్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయ్, చైర్మన్ అభ్యర్ధి పద్మావతి, కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పీకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.


