సెజ్‌లో ఐఓసీఎల్ కూడలి వద్ద దర్శనమిచ్చిన కూటమి ఫ్లెక్సీ
అచ్యుతాపురం రూరల్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు సెజ్ పరిసరాల్లో ఐఓసీఎల్ కూడలి వద్ద దర్శనమివ్వడం, అధికారులు వాటిని తొలగించకపోవడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు బహిరంగంగా కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి విషయంలో అధికారులు సమానంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్షాలకు మరో విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు పెంటనే తొలగించి, ఎన్నికల నియమావళిని సమానంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


