ఈవీఎం గోడౌన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

తుమ్మపాల: ఈవీఎం గొడౌన్‌ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్‌ బుక్‌ లో సంతకం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్‌ కార్యక్రమం ద్వారా ఓటర్‌ జాభితా అంశాలు, స్ధానిక సంస్థల ఎన్నికల అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, జి శ్రీను, నాగేశ్వరరావు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్‌ సెల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement