తీరప్రాంతాల్లో అలజడి | - | Sakshi
Sakshi News home page

తీరప్రాంతాల్లో అలజడి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

తీరం ఒడ్డున లంగరు వేసిన బోట్లు

నక్కపల్లి : నియోజకవర్గంలో తీరప్రాంతాల్లో ఆర్నాబ్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అలజడి నెలకొంది. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక పక్క స్దానిక ఎన్నికల హడావిడి,మరోపక్క తుఫాను హెచ్చరికలు అధికారులకు అటు తీరప్రాంత గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తుపాను వైజాగ్‌, బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో తీరప్రాంతాలను ఆనుకుని నివసిస్తున్న సుమారు 17 మత్య్సకార గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. రాజయ్యపేట, పెదతీనార్ల, చినతీనార్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, బంగారమ్మపాలెం, పెంటకోట, వెంకటనగరం, పాల్మన్‌పేట, రాజవరం, బోయపాడు,రత్నాయంపేట, కొర్లయ్యపేట దొండవాక తదితర గ్రామాలు సముద్రతీరానికి చాలా దగ్గరలో ఉన్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. దీంతో మత్య్సకారులెవరూ వేటకు వెళ్లొద్దని దండోరాలు వేయించారు. తుపాను కారణంగా అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశంతో మత్య్సకారులను సమీపంలో ఉన్న తుపాను రక్షిత భవనాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఆర్వోలను, పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement