చోడవరం/మాడుగుల/దేవరాపల్లి : ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జేసీ శౌర్యమాన్‌పటేల్ ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కౌంటింగ్, బ్యాలెట్ బాక్స్‌ల స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసే చోడవరంలో గాంధీ గ్రామం గవర్నమెంటు హైస్కూల్‌ను, మాడుగుల ఆర్‌సీఎం ఇంగ్లిష్ మీడియం పాఠశాలను సోమవారం ఆయన వేర్వేరుగా పరిశీలించారు. రెండేసి గదులను కలిపి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ఎన్నికల అధికారి సుధీర్‌బాబు, తదితరులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌ల స్ట్రాంగ్ రూమ్ నిర్వహణలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనకాపల్లి ఆర్డీవో శ్రీనివాసరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ శేషుబాబు, ఎంపీడీవో రాజు పాల్గొన్నారు. అలాగే దేవరాపల్లి మండలం తెనుగుపూడి గురుకుల విద్యాలయంను జేసీ సందర్శించి ఓట్ల కౌంటింగ్, బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించారు. కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్ ఒక భవనంలోను, మాడుగుల మండలం ఓట్ల లెక్కింపునకు మరో భవనంలోను చేసేలా ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పక్కాగా కల్పించాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచినప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్‌ఐ సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి మంజులవాణి, ఎంపీడీవోలు ఎస్.కె.వరప్రసాద్, కె.అప్పారావు, సాంబమూర్తి, తహసీల్దార్లు లక్ష్మీదేవి, నాగరాజు, రమాదేవి పాల్గొన్నారు.


