విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

అనకాపల్లి : అర్నాబ్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అనకాపల్లి ఆపరేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ జి. ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్‌ యంత్రాంగం సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్‌ శాఖ కార్యాలయంలో 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌ (ఫోన్‌ నంబర్‌ : 8712410720 (ఎల్‌ఎంసీ అనకాపల్లి) ఏర్పాటు చేశామన్నారు. వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్‌ తీగలను, తడిసిన విద్యుత్‌ స్తంభాలను, విద్యుత్‌ తీగలపై పడిన చెట్ల కొమ్మలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా తాకరాదన్నారు. తెగిపడిన విద్యుత్‌ తీగలు కనిపించినా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, ఇతర సమస్యలు తలెత్తినా వెంటనే సమీపంలోని విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయానికి లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు సమాచారం అందించాలన్నారు. విద్యుత్‌ అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదులను వాట్సాప్‌ ద్వారా కశింకోట డివిజన్‌, 8333810597, అనకాపల్లి డివిజన్‌, 9063110544, నర్సీపట్నం డివిజన్‌ : 9491030714కు తెలియజేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement