సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రెండు ఎలక్ట్రిక్ బులెరో గూడ్స్ వాహనాలను వితరణగా అందజేసింది. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్‌కుమార్ ఈ వాహనాలను సింహగిరిపై దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వైదికులు వాహనాలకు పూజలు నిర్వహించారు. దేవస్థానం నిత్య సేవా కార్యక్రమాలకు, సామగ్రి రవాణాకు ఈ వాహనాలను వినియోగించనున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం రాహుల్ సంకృతియా, రీజినల్ మేనేజర్ అభిషేక్ కుమార్, సింహాచలం ఎస్‌బీఐ మేనేజర్ భాస్కర్ జగన్నాథం పాల్గొన్నారు.


