అమ్మవారిని దర్శించుకుంటున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్, కుటుంబ సభ్యులు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి.ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఉద్యోగులు పూర్ణకుంభంతో మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ లక్ష్మీనగేష్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


