పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధం

Oct 20 2026 4:19 AM | Updated on Oct 20 2026 4:19 AM

● రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● నవంబర్‌ 3న పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు ● 24 జెడ్పీటీసీ, ఎంపీపీ, 427 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

అనకాపల్లి: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 24న వాటిని పరిశీలించనున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి, 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ విభజన అనంతరం అనకాపల్లి జెడ్పీ కార్యాలయం ఇటీవల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా జిల్లా పరిషత్‌కు ఎన్నిక జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలో 427 ఎంపీటీసీ సెగ్మెంట్లు, 24 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ పీఠానికి ప్రత్యక్ష ఎన్నిక జరగనుంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో ప్రధాన పార్టీల్లో ఆశావహులు టికెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీటీసీ స్థానాలకు, జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్‌ ప్రక్రియ లిస్టును నోటీస్‌ బోర్డులో ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement