వైఎస్సార్‌సీపీలో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో జోష్‌

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

● కోలాహలంగా నర్సీపట్నం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అనిత నామినేషన్‌ ● మాజీ ఎమ్మెల్యే గణేష్‌ ఆధ్వర్యంలో శ్రేణుల భారీ ర్యాలీ

నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల అనిత నామినేషన్‌ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు ఆధ్వర్యంలో బ్యాంక్‌ కాలనీలోని అనిత నివా సం నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తీన్‌మార్‌ డప్పులు, నృత్యాలు, పార్టీ జెండాల రెపరెపల తో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వి.వి.రమణకు అనిత నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనితతోపాటు 40 వార్డుల్లో బరిలో ఉన్న పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించి కూటమి నాయకులకు ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనితకు రాజకీయ అనుభవంతో పాటు పాలనపై మంచి పట్టు ఉందన్నారు. సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌గా ఆమె పనిచేశారని గుర్తుచేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని గణేష్‌ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, మహిళ లు, రైతులకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి పథకాల కు సంబంధించి పట్టణ ప్రజలకు రూ.237 కోట్లు బకాయి పడ్డారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పకపోతే ప్రజలను మరింత మోసం చేసే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ అనిత మచ్చలేని రాజకీయ నాయకురాలని, పట్టణ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందన్నారు. తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో రూపొందించిన ప్రణా ళికల ఆధారంగానే పట్టణం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. విస్తరిస్తున్న నర్సీపట్నంలో మౌలిక సదు పాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల అనిత మాట్లాడుతూనకు అవ కాశం కల్పిస్తే నర్సీపట్నాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్‌ సతీమణి పెట్ల కళావతి, అనిత తనయుడు, సినీనటుడు జోగినాయుడు, పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు చింతకాయల వరుణ్‌, పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మాజీ చైర్‌పర్సన్‌ సుబ్బలక్ష్మి, మాజీ వైస్‌ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement