ప్రశాంత ఎన్నికలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

అనకాపల్లి టౌన్‌: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు తప్పనిసరి గా ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో డిసెంబర్‌ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ రద్దు

అనకాపల్లి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్‌ 3 వరకు ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత బందోబస్తు, భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించారు.

పెయిడ్‌ న్యూస్‌పై నిఘా

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ఎన్నికల మీడియా పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎ.భార్గవతేజ, ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.వెంకట సందీప్‌రెడ్డి సూచించారు. ఆదివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రం, మీడియా రూమ్‌లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా మీడియా పర్యవేక్షణ చేపట్టాలని, రాజకీయ ప్రకటనల ధ్రువీకరణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పెయిడ్‌ న్యూస్‌, రాజకీయ ప్రకటనలు, ఇతర ప్రచార అంశాలపై నిబంధనల ప్రకారం నిఘా ఉంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement