స్వచ్ఛ పాలన | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ పాలన

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

సేవ్‌ విశాఖ లక్ష్యంగా

విశాఖ కోడలిగా నగర సమస్యలపై పూర్తి అవగాహన ఉంది

మాది ‘సేవ్‌ విశాఖ’ ..కూటమిది ‘సేల్‌ విశాఖ’

వైఎస్‌ జగన్‌ హయాంలోనే విశాఖ అభివృద్ధి

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో

ఎమ్మెల్సీ, జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి

ప్రకృతి సంపద ధ్వంసం

విశాఖకు ఊపిరితిత్తుల్లాంటి కొండలు, చెట్లను కాపాడటంలో పాలకులు విఫలమయ్యారు. అభివృద్ధి పేరుతో కొండలను తవ్వడం, చెట్ల నరికివేతతో నగరంలో కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సింహాచలం అప్పన్న కొండతో పాటు ఇతర కొండలను కొల్లగొడుతున్నారు. బీచ్‌ షాక్స్‌ పేరుతో విశాఖ సంస్కృతికి నష్టం కలిగిస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌

ప్రైవేటీకరణపై గళమెత్తా

విశాఖ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, పోరాటాల ఫలితమైన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్రలు జరుగుతున్నాయి. కార్మికులు, ప్రజల త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు నగరి ఉనికిని కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తాను శాసనమండలిలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీశా.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సమగ్ర అభివృద్ధి,

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిజాయతీతో పాలన అందిస్తానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థి

వరుదు కల్యాణి తెలిపారు. ఉత్తరాంధ్రలో పుట్టి విశాఖ కోడలిగా 25 ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉందని, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.

వైఎస్సార్‌సీపీ ‘సేవ్‌ విశాఖ’ నినాదంతో ప్రజల్లోకి

వెళ్తుండగా.. కూటమి ప్రభుత్వం ‘సేల్‌ విశాఖ’ విధానంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్‌ హయాంలో ఐటీ, పర్యాటకం, మౌలిక వసతుల్లో విశాఖ

అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కూటమి పాలనలో అవినీతి, భూకబ్జాలు పెరిగాయని, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. విశాఖ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని

గెలిపించాలని కోరారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఆమె మాట్లాడారు.

‘ఆపరేషన్‌ లంగ్స్‌’తో

రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు

కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో పేదలు, సామాన్యుల జీవన పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో విశాఖ అభివృద్ధి బాటలో సాగితే.. కూటమి పాలనలో తాగునీటి సమస్య నుంచి చిరు వ్యాపారుల వరకు అనేక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో ఫుడ్‌ కోర్టులు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలను తొలగించి వేలాది మంది చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తొలగింపులతో పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

కూటమి పాలనలో

అవినీతి, దోపిడీ

కూటమి పాలనలో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవినీతి, అక్రమాలు, సమస్యలకు కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల విలువైన భూముల దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు, వనరులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బినామీలు, అనుకూల వర్గాలకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నా.. ఆచరణలో ముందడుగు పడడం లేదు. నగర ప్రజలపై పన్నుల భారం పెంచారు. విశాఖ రోడ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైన విధానం కాదు.

మత్తులో ఊగుతున్న నగరం

నగరంలో చెత్తాచెదారం, వెలగని వీధిలైట్లు, మురుగునీటి కాలువలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు సమస్యలుగా మారాయి. విశాఖ సంపదపై చూపిస్తున్న శ్రద్ధను అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చూపడం లేదు. వీధిలైట్లు సరిగా లేకపోవడంతో చీకటి ప్రాంతాల్లో మద్యం, గంజాయి వినియోగం పెరుగుతోంది. రాత్రివేళల్లో మహిళలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మహిళలపై దాడులు, పోక్సో కేసులు పెరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌

దెబ్బతీసేందుకే నీటి సంక్షోభం

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న విశాఖ ప్రతిష్టను దెబ్బతీసి, పెట్టుబడులను అమరావతికి మళ్లించేందుకే కుట్ర జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంపై వివక్ష చూపుతోంది. ఆరు నెలలుగా నగరవాసులు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు డబ్బులు పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాకాలంలోనే రిజర్వాయర్లు ఎండిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఎల్‌నినో ప్రభావమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో నీటి సమస్య ఉందనే ప్రచారంతో పెట్టుబడులను అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జగన్‌ హయాంలో విశాఖ అభివృద్ధి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ అభివృద్ధికి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు తీసుకొచ్చాం. భోగాపురం ఎయిర్‌పోర్టు, నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు ఆరు లైన్ల రహదారి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏ+++ ర్యాంకు, రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వంటి ప్రాజెక్టులు నగర ప్రతిష్టను పెంచాయి. విశాఖలో బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టి ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి సంస్థల రాకకు చర్యలు తీసుకున్నాం. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు, జీ20 సన్నాహక సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. నగరంలో రోడ్ల విస్తరణ, ఐకానిక్‌ జంక్షన్ల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌, బస్‌బేల నిర్మాణం వంటి పనులు చేపట్టాం. సిరిపురం డెక్‌ భవనం, మూడో దశ లోవ రిజర్వాయర్‌ రక్షణ పనులు కూడా మా హయాంలోనే చేపట్టాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement