ముగ్గురు పాత నేరస్తుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు పాత నేరస్తుల అరెస్ట్‌

Oct 20 2026 4:19 AM | Updated on Oct 20 2026 4:19 AM

● 28 చోరీ కేసులు ఛేదింపు ● 37.95 తులాల బంగారం, 6.361 కిలోల వెండి స్వాధీనం

పరవాడ: అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80.43 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. పరవాడ డీఎస్పీ బి.మోహన్‌రావు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ నెల 6న జరిగిన చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆదివారం హైవే బస్‌స్టాప్‌ వద్ద తనిఖీల సమయంలో బైక్‌పై వెళుతున్న చేపల ఆనంద్‌, చిత్తరపు అభిషేక్‌, నిమ్మాడ దిలీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారం, వెండి ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో విశాఖ, అనకాపల్లి పరిధిలో 31 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. వారి విచారణలో మునగపాక, నక్కపల్లి, రాంబిల్లి, పరవాడ, యలమంచిలి, సబ్బవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన 28 చోరీలకు సంబంధించిన సొత్తును గుర్తించారు. ఇందులో రూ.66.72 లక్షల విలువైన 37.95 తులాల బంగారం, రూ.13.71 లక్షల విలువైన 6.361 కిలోల వెండి, రూ.30 వేల నగదు ఉన్నాయి. కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో ఛేదించిన పరవాడ డీఎస్పీ మోహన్‌రావు, యలమంచిలి సీఐ ధనుంజయరావు, పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు, రాంబిల్లి సీఐ నరసింగరావు, మునగపాక ఎస్‌ఐ ప్రసాదరావు, హెడ్‌ కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement