మేం చేసిన తప్పేంటి?
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు వలంటీర్లను తొలగించం..అధికారంలోకి వస్తే మీ సేవలను కొనసాగిస్తాం..నెలకు రూ,10వేలు అందించి ఆదుకుంటామని బహిరంగ సభల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు మీకు జీఓనే లేదని మమ్మల్ని మోసగించి వెన్నుపోటు పొడిచారు. ఇపుడు టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఇన్‌ప్లుయెన్సర్లను అందలం ఎక్కిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారం కాదా.? – కంటే పద్మరేఖ, మాజీ వలంటీర్, మంగళాపురం, బుచ్చెయ్యపేట మండలం
ఎన్నికల ప్రచారంలో మా వలంటీర్ల వ్యవస్థను ఆకాశానికెత్తిన పెద్దమనిషి గెలిచిన తర్వాత తొలగించి రోడ్డున పడేశారు. ఈ వ్యవస్థలో లోపాలేంటో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ప్రజాధనం మాకోసం ఖర్చు చేసినా అది ప్రజలకు ఉపయోగపడే సేవలకే ఖర్చయింది. కానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సబబు కాదు. చాలా మంది వలంటీర్లు ప్రస్తుత ప్రభుత్వ హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయారు. – మెట్ట మాధురి, మాజీ వలంటీర్


