ప్రతి ఇంటికిసోలార్‌ పవర్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికిసోలార్‌ పవర్‌ లక్ష్యం

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

● పీఎం సూర్యఘర్‌ పథకం కింద ● 10 వేల కనెక్షన్లు మంజూరు ● ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ప్రసాద్‌ వెల్లడి

మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.ప్రసాద్‌

అనకాపల్లి : జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని, వినియోగదారులకు అనుగుణంగా అనకాపల్లి ఎన్టీఆర్‌ బెల్లం మార్కెట్‌, బుచ్చెయ్యపేట మండలంలో, సుబ్బవరం మండలం మంగళపాలెం పరిసర ప్రాంతాల్లో కొత్తగా 130 కేవీ సబ్‌స్టేషన్లు, అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో 230 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.ప్రసాద్‌ అన్నారు. స్థానిక గవరపాలెం జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా విద్యుత్‌ సమస్య ఉన్నట్టయితే 1912కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. గృహాల్లో విద్యుత్‌ లోడ్‌ను బట్టి ఎంసీబీలు వాడడం వల్ల గృహపరికరాలు పాడవకుండా భద్రంగా ఉంటాయన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్‌ కింద 10వేల కనెక్షన్లు మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం వినియోగదారునికి రాయితీ ఇస్తుందని తెలిపారు. ఈ స్కీమ్‌ వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుందని, వినియోగదారుల అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు జిల్లాలో ఉచితంగా 12 వేల కనెక్షన్లు అందజేశామన్నారు. పీఎం కుసుమ అగ్రి కింద 250 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ రైతులకు అందజేస్తున్నామన్నారు. ప్రతి గృహంలో సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుని పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో యు.కె.జి. ప్రసాద్‌, మహ్మద్‌ జెయిన్‌ ఉల్లా, కుమారీ గౌరీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement