జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌లో హైమావతి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌లో హైమావతి ప్రతిభ

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

అవార్డు అందుకుంటున్న హైమావతి

అచ్యుతాపురం రూరల్‌ : మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన జూరెడ్డి హైమావతి జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 72వ జాతీయ సీనియర్‌ మహిళా, పురుషుల బాల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరపున పాల్గొని, రాష్ట్ర జట్టు మూడో స్థానం సాధించడంలో కీలకంగా నిలిచారు. పోటీల్లో హైమావతి ప్రతిభకు గుర్తింపుగా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డును అందజేసింది. హైమావతి తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, తల్లి రోజువారీ కూలీగా పనిచేస్తున్నప్పటికీ క్రీడపై కుమార్తెకు ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో రాణించి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న హైమావతిని శ్రీరామ బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మెన్‌ ఆర్‌.వి.వి.నగేష్‌, జిల్లా జిల్లా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గొంప నరసింహనాయుడు, అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పెదపూడి శంకర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ క్రీడాకారులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement