సచివాలయ ఉద్యోగులపై నిర్బంధం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై నిర్బంధం దుర్మార్గం

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

అనకాపల్లి : సచివాలయం ఉద్యోగులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కూటమి ప్రభుత్వం వారిపై అక్రమకేసులు పెట్టడం, విధులు నుంచి తొలగించడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగిందని, ఉద్యోగులంతా సిద్ధమైన తరుణంలో పోలీసులతో జిల్లాలో ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామిక చర్యలన్నారు. ఉద్యోగుల పట్ల వారి సమస్యలపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించడం వల్లే ఉద్యోగులు ఆగ్రహానికి గురైనట్టు ఆయన పేర్కొన్నారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, పెండింగ్‌ బకాయిలు, ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. విజయవాడలో పోలీసులతో అరెస్టు చేయించిన సచివాలయం ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శంకరరావు, జిల్లా కార్యదర్శి అడిగడ్ల రాజులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement