నిజాయితీ, నిబద్ధత గల నేత బలిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ, నిబద్ధత గల నేత బలిరెడ్డి

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

చోడవరం: నిజాయితీ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దివంగత బలిరెడ్డి సత్యారావు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మండలంలోని పీఎస్‌పేటలో దివంగత బలిరెడ్డి 8వ వర్థంతిని ఆదివారం ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిర్వహించారు. బలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యతో కలిసి అమర్‌నాథ్‌ ఘనంగా నివాళులర్పించారు. బలిరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి, జిల్లాకు ఎంతో సేవలు చేశారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు శానాపతి సత్యారావు, దన్నిన వెంకట్రావు, మాజీ వైస్‌ ఎంపీపీ బైన ఈశ్వరరావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంపలి ఆనందీశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, కోవెల జనార్దన్‌, పట్టణాధ్యక్షుడు దేవరపల్లి సత్య, జిల్లా ప్రతినిధులు బూడెడ్ల శంకరావు, బొడ్డేడ సూర్యనారాయణ, ఓరుగంటి నెహ్రూ, బూరే బాబూరావు, దొడ్డి వెంకట్రావు, పుట్రేవు శ్యామ్‌ప్రసాద్‌, చవితిన బాబూరావు, హారిక రామకృష్ణ, ఉప్పలబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement