అనకాపల్లి : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 25న ఒడిశా రాష్ట్రం ఖురదా జిల్లా, బర్గ్ గ్రామానికి చెందిన సురేశన్ మహాపాత్ర (62) కుటుంబ సమేతంగా ఖుర్దా నుంచి ముంబై వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరారు. ఈనెల 26న అనకాపల్లి వస్తున్న సమయంలో మహాపాత్రకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆన్‌లైన్‌లో రైల్వే హెల్ప్ నంబర్‌కు ఫోన్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్‌ల్లో రైలును ఆపి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో మహాపాత్ర మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఎన్టీఆర్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహానికి ఆదివారం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి మృతుడు కుటుంబ సభ్యులకు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.వి.లక్ష్మి అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.


