లక్ష్మీగణపతి ఆలయంలో టైల్స్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీగణపతి ఆలయంలో టైల్స్‌ ఏర్పాటు

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

● ఎంపీడీవో కుటుంబ సభ్యులు రూ. 3.50 లక్షల విరాళం

నక్కపల్లి: మండలంలోని ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి ఆలయానికి కాకినాడ జిల్లా కోటనందూరు ఎంపీడీవో పుప్పాల వెంకటనారాయణ, ఆయన కుమారుడు, ఫాల్క్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ చైతన్యశ్రీనివాస్‌, మోహన్‌ అలేఖ్య దంపతులు రూ.3.50 లక్షల విలువైన టైల్స్‌ వేయించారు. వెంకటనారాయణ గతంలో నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఈవోపీఆర్‌డీగా పనిచేశారు. పాయకరావుపేట పట్టణానికి చెందిన ఈయన పదోన్నతిపై కోటనందూరు ఎంపీడీవోగా వెళ్లారు. టైల్స్‌ ఏర్పాటు చేయించిన సందర్భంగా వెంకటనారాయణ కుటుంబ సభ్యులను ఆలయ వర్గాలు ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement