మహారాణిపేట: చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన పాయకరావుపేటకు చెందిన గరికిన శరణ్య విద్యాభ్యాసానికి విశాఖలోని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. అమ్మమ్మ సంరక్షణలో ఉంటూ కళాశాలలో చదువుకుంటున్న శరణ్య ఏడాదికి మొత్తం రూ.46 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం రూ.10 వేలు ఫీజు మినహాయింపు ఇవ్వగా.. ఈ నెల 16న బెంగళూరుకు చెందిన దోర్నాల బిందుమాధవ్ పంపించిన రూ.10 వేలను మొదటి విడత ఫీజుగా ఆదివారం శరణ్యకు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గూడూ రు సీతామహాలక్ష్మి చెక్కు రూపంలో అందజేశారు.


