పాయకరావుపేట : విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఆలీ తెలిపారు. మండలంలో గల సత్యవరం గ్రామానికి చెందిన గేదెల మల్లేశ్వరరావు (60) అను వ్యక్తి పెదరాంభద్రపురం గ్రామానికి చెందిన రైతు తమలపాకు తోటలో పని చేయుటకు వెళ్ళాడు. తమలపాకు తోటలో వున్న విద్యుత్ స్తంభం కరెంట్ వైర్లు తెగి పని చేసుకుంటున్న మల్లేశ్వరరావు పై పడినవి. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆలీ తెలిపారు.


