మున్సిపల్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

పార్టీ నేతలకు కురసాల పిలుపు

నర్సీపట్నం : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించాలని ఆ పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా మనవైపు నిలబడే వారినే అభ్యర్ధులుగా నిలపాలన్నారు. ప్రధానంగా నర్సీపట్నం పురపాలిక ఎన్నికల్లో అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్ధులను నిలపాలన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వరాదని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులు, అధికార యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని, అయినా ఎక్కడా రాజీపడకుండా గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీని కై సవం చేసుకునేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్నారు. అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాఽనాలను నెరవేర్చలేదని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకమని..పురపాలిక, గ్రామాల్లో తమ పార్టీ గాలి వీస్తోందన్నారు. ఎలక్షన్లను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. వైఎస్సార్‌సీపీపై ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. గత ప్రభుత్వం..ప్రస్తుత ప్రభుత్వపై బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అన్ని స్థానాల్లోను పోటీ చేస్తామన్నారు. మున్సిపాలిటీతో పాటు పంచాయతీల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, టౌన్‌ పార్టీ అధ్యక్షులు ఏకా శివ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బొడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శులు మాకిరెడ్డి బుల్లిదొర, పెట్ల అప్పలనాయుడు, నియోజకవర్గ నాయకులు తమరాన శ్రీను, పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement