గుల్ల కార్మికులకు కూటమి సున్నం | - | Sakshi
Sakshi News home page

గుల్ల కార్మికులకు కూటమి సున్నం

Sep 14 2026 3:38 AM | Updated on Sep 14 2026 3:38 AM

స్టీల్‌ప్లాంట్‌ కోసం బట్టీ భూములు స్వాధీనం నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు

కూటమి ప్రభుత్వం గుల్ల కార్మికులకు సున్నం పెట్టింది. స్టీల్‌ప్లాంట్‌ కోసం వారి ఉపాధికి గండి కొట్టింది. నష్టపరిహారం చెల్లించకుండా భూములు లాక్కుంటోంది. దీంతో 50 కుటుంబాల వారు రోడ్డున పడ్డారు. భవిష్యత్తు

అగమ్యగోచరంగా మారడంతో

వారు కన్నీటిపర్యంతమవు

తున్నారు.

చందనాడలో పొక్లెయిన్లతో భూములు

చదును చేయిస్తున్న దృశ్యం

నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ కోసం కూటమి ప్రభుత్వం గుల్ల కార్మికులకు అన్యాయం తలపెడుతోంది. తరతరాలుగా బట్టీలు ఏర్పాటు చేసుకుని గుల్ల సున్నం తయారీతో ఉపాధి పొందుతున్న వారి నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటోంది. నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయానికి ఒడిగట్టింది. ఈ భూములు స్వాధీనం చేసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే చందనాడలో సర్వే నంబరు 65లో సుమారు 10.75 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో చందనాడకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు 100 గుల్ల బట్టీలు ఏర్పాటు చేసుకుని తాతముత్తాతల నుంచి గుల్ల సున్నం తయారీ చేసి గ్రామాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి గుల్ల వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో బట్టీల సంఖ్య తగ్గిపోయింది. ఈ భూముల్లో ఉన్న కంచె చెట్లను అమ్ముకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.

మొర వినే నాథుడే కరవు

ఈ భూములను కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా స్వాధీనం చేసుకుని స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తోంది. పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వ భూములు, డీఫారం భూములకు ఎకరాకు రూ.12 లక్షల చొప్పున, జిరాయితీ భూములకు రూ.18 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తమకు కూడా అదే రీతిలో నష్టపరిహారం చెల్లించాలని గుల్ల సున్నం కార్మికులు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. తరతరాల నుంచి ఈ భూముల్లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి బట్టీలు నిర్వహిస్తున్నామని, ఏటా నవంబరు నుంచి జనవరి వరకు గుల్ల సున్నం తయారు చేసి గ్రామాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నామని వారు తెలిపారు. దళితులమైన మాకు ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని ఆరోపించా రు. పైసా నష్టపరిహారం చెల్లించకుండా స్టీల్‌ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లకు లక్షలాది రూపాయలకు విక్రయిస్తోందన్నా రు. ఇతర గ్రామాల్లో ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న వారికి రూ.6 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారని, తమకు మాత్రం పైసా నష్టపరిహారం ఇవ్వడం లేదని వారు వాపోయారు. డి.ఎల్‌.పురం, అమలాపురం తదితర గ్రామాల్లో శ్మశానాలను సహితం మావే అని చెప్పిన పలువురికి రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారన్నా రు. తాము బట్టీలు నిర్వహిస్తున్న భూములకు డీఫారం పట్టాలు ఇవ్వాలని పదేళ్లుగా అధికారు లను కోరు తున్నా పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ కోసం ఆగమేఘాల మీద చదును చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి చందనాడలో గుల్ల కార్మికుల స్వాధీనంలో ఉన్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని దళితులు కోరుతున్నారు.

కేసులు పెడతామంటూ బెదిరింపులు

రెండు నెలల నుంచి ఈ భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు వ్యతిరేకిస్తూ తమ ఉపాధికి గండికొట్టవద్దని వేడుకొంటున్నారు. వారి విజ్ఞప్తులను పట్టించుకోని అధికారులు ఆదివారం పొక్లెయిన్లతో భూమిని చదునుచేసే పనులు ప్రారంభించారు. అధికారుల చర్యలను కొంతమంది గుల్ల కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ‘‘మీకు ఎటువంటి హక్కులు లేవని, పట్టాలు ఇవ్వలేదు గనుక పనులను అడ్డుకుంటే పోలీసు కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి వస్తుంది’’ అని అధికారులు బెదిరిస్తున్నారంటూ పలువురు కార్మికులు వాపోయారు.

ప్రభుత్వం అన్యాయం చేస్తోంది

ఈ భూముల్లో గుల్ల బట్టీలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నాం. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తోంది. కార్మికులకు మాత్రం ఒక్క పైసా నష్టపరిహారం చెల్లించలేదు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. మా వెనుక రాజకీయ నాయకులు లేకపోవడం వల్లే ప్రభుత్వం మాకు అన్యాయం తలపెడుతోంది.

– పెదపూడి సువర్ణరాజు, చందనాడ

నష్టపరిహారం చెల్లించాలి

తరతరాలుగా ఈ భూములను నమ్ముకుని ఉపాధి పొందుతున్నాం. ఇటీవల గుల్ల వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. దీంతో ఈ భూముల్లో చెట్లను అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నాం. అక్కడక్కడ బట్టీలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాం. ఉన్నఫలంగా భూములు లాక్కొని పైసా నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది. తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలి.

– ఏడిద మన్నియ్య, చందనాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement